సముద్ర జీవసంపద పెంపుదల, చేపల సంతానోత్పత్తి కాలం కోసం ఏపీ తీరప్రాంతంలో విధించిన 61 రోజుల వార్షిక చేపల వేట నిషేధం ఏప్రిల్ 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చి, ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. దీంతో మత్స్యకారులు మళ్లీ సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ జెట్టీలు, బోట్లు మళ్లీ సందడిగా మారాయి. మత్స్యకారులు తమ నెట్లను, బోట్లను సిద్ధం చేసుకుంటున్నారు.