ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో బావిశెట్టి లక్ష్మణ్ (27) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గోకార్టింగ్ నుంచి పెద్దిపాలెం వెళ్తూ ఇంధనం నింపుకొని తిరిగి వస్తున్న అతని స్కూటీని, ఎదురుగా అతివేగంగా వచ్చిన పల్సర్ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మణ్ ముఖం, దవడ ప్రాంతాల్లో గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ ద్వారా అతన్ని తగరపువలసలోని నీరుకొండ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.