విశాఖలో స్కూల్ బస్సుల తనిఖీలు

9చూసినవారు
విశాఖలో స్కూల్ బస్సుల తనిఖీలు
విశాఖ జిల్లాలో విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థల బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు ముమ్మరం చేసింది. ఏప్రిల్ 28 నుండి ఇప్పటి వరకు 1,250 బస్సులకు గాను 368 బస్సులను తనిఖీ చేయగా, భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న 76 బస్సులను గుర్తించారు. ఈ బస్సుల లోపాలను 7 రోజుల్లోగా సరిదిద్దుకుని, డీటీసీ కార్యాలయంలో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్