విశాఖ: వరకట్న రహిత సమాజమే ధ్యేయం కావాలి

1చూసినవారు
విశాఖ: వరకట్న రహిత సమాజమే ధ్యేయం కావాలి
వరకట్నం అనే సామాజిక దురాచారాన్ని అంతం చేయడానికి చట్టపరమైన అవగాహనతో పాటు యువతలో మార్పు అత్యవసరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్. సన్యాసినాయుడు పిలుపునిచ్చారు. మర్రిపాలెంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో శనివారం జరిగిన 'వరకట్న నిషేధ చట్టం–1961' అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కట్నం తీసుకోవడం, ఇవ్వడం లేదా ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని, దీనికి కనీసం ఐదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా పడుతుందని హెచ్చరించారు. వేధింపులకు గురయ్యే మహిళలు 181, 1098 హెల్ప్‌లైన్లను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్