పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖ

883చూసినవారు
పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖ
భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఆనందపురం మండలం తర్లువాడలో త్వరలో జరగనున్న గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన ఏర్పాట్లను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ డేటా సెంటర్ కోసం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి వస్తుందని, ఇది స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ పాత్రలాగే, విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ 'గేమ్ చేంజర్' కానుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్