విశాఖ రుషికొండ భవనాల వినియోగంపై అధ్యయనం చేస్తున్న కేబినెట్ సబ్ కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది. మంగళవారం మంత్రి కందుల దుర్గేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా బాలవీరాంజనేయస్వామి వర్చువల్‌గా హాజరై నివేదికలోని అంశాలపై చర్చించారు. ఈ భవనాలను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయ వనరులుగా మార్చేలా అంతర్జాతీయ హోటల్ గ్రూపులకు లీజుకు ఇచ్చే అంశంపై కమిటీ ప్రధానంగా చర్చించింది. ఈ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ఉంచి, రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుర్గేశ్ వెల్లడించారు.