విశాఖ: పెట్రోల్ కొరతపై అపోహలు నమ్మొద్దు

4చూసినవారు
విశాఖ: పెట్రోల్ కొరతపై అపోహలు నమ్మొద్దు
విశాఖ నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారంలో వాస్తవం లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన రామాటాకీస్ సమీపంలోని హెచ్. పి. బంకును ఆకస్మికంగా తనిఖీ చేసి, జిల్లాలోని 123 బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. అనవసరంగా 'పానిక్ బైయింగ్' చేసి రద్దీ పెంచవద్దని, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి కూడా పోలమాంబ ఆలయం వద్ద గల బంకును తనిఖీ చేసి నిల్వలపై ఆరా తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్