విశాఖపట్నంలో ఆదివారం తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ భల్లా నేవీ ఫౌండేషన్ సభ్యులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. నావికాదళంలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ చేసిన మాజీ అధికారులను, సిబ్బందిని ఆయన కలిశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నేవీ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలపై చర్చించారు. మాజీ సైనికుల సంక్షేమానికి నౌకాదళం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.