విశాఖ: నగరాభివృద్ధి దిశగా జీవీఎంసీ సేవలు

6చూసినవారు
విశాఖ: నగరాభివృద్ధి దిశగా జీవీఎంసీ సేవలు
విశాఖపట్నం, గురువారం: విశాఖ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌కు అధికారులు, ఉద్యోగులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కమిషనర్ బంగ్లాలో జరిగిన కార్యక్రమంలో అదనపు కమిషనర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2025లో యోగాంధ్ర–2025, సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ వంటి కార్యక్రమాల ద్వారా జీవీఎంసీకి మంచి గుర్తింపు లభించిందని, 2026లో కూడా అంతర్జాతీయ కార్యక్రమాల నిర్వహణకు అధికారులు కృషి చేసి విశాఖ నగర అభివృద్ధికి సేవలందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్