విశాఖపట్నం నూతన సంవత్సర వేడుకలతో ఉత్సాహంగా మారింది. నగరంలోని స్టార్ హోటళ్లు, పబ్‌లు, రిసార్టులు ప్రత్యేక ఈవెంట్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి. లైవ్ మ్యూజిక్, డీజేలు, థీమ్ పార్టీలతో పాటు ప్రత్యేక వంటకాలు, పానీయాల ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. పర్యాటకుల తాకిడి పెరగడంతో నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు పూర్తిగా నిండిపోయాయి.