శనివారం విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ సింహాచలంలోని శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. నాదస్వర మంగళవాయిద్యాలు, వేదఘోషల మధ్య అర్చకులు ఎంపీ భరత్‌ను ఆలయంలోకి ఆహ్వానించారు. క్షేత్ర మహిమాన్విత కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని, బేడా మండపం ప్రదక్షిణ చేసిన అనంతరం అప్పన్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.