విశాఖ: కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ పై నాగాలాండ్ సీఎం సందడి

594చూసినవారు
విశాఖ: కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ పై నాగాలాండ్ సీఎం సందడి
విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన నాగాలాండ్ ముఖ్యమంత్రి నేయిఫియు రియూ, నగరంలోని కైలాసగిరిని సందర్శించారు. ఇటీవల ఏర్పాటు చేసిన 'గ్లాస్ బ్రిడ్జ్' పై నడిచి, ఆ అనుభూతి అద్భుతంగా ఉందని ఆయన పేర్కొన్నారు. విశాఖ నగరం ప్రకృతి ఒడిలో అందంగా ఉందని, పర్యాటక ప్రదేశాలు ఆకట్టుకుంటున్నాయని ప్రశంసించారు. విశాఖ పర్యటన తనకు ఆహ్లాదాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.