విశాఖపట్నంలోని కంచరపాలెంలోని అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటశాల ప్రాంగణంలో గురువారం సాయంత్రం హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో శ్రీ నరసింహ జయంతి మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా శ్రీ నరసింహ యజ్ఞం, హరినామ సంకీర్తన నిర్వహించారు. కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన ‘శ్రీ నరసింహ లీలలు’ నాటకం భక్తులను ఆకట్టుకుంది. హరే కృష్ణ మూవ్‌మెంట్ ప్రెసిడెంట్ డాక్టర్ నిష్కించన భక్త దాస నరసింహ అవతార విశిష్టతపై ప్రవచనం చేశారు.