విశాఖ‌: పారిశుధ్యంలో నిర్లక్ష్యం సహించం

4చూసినవారు
విశాఖ‌: పారిశుధ్యంలో నిర్లక్ష్యం సహించం
జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పారిశుధ్య విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈస్ట్, భీమిలి జోన్లలో ఆకస్మికంగా పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. బీచ్ రోడ్డు, గంటస్తంభం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ఇంటింటి చెత్త సేకరణ, కాలువల శుభ్రత, వ్యర్థాల తరలింపు పనులు శతశాతం జరగాలని అధికారులను ఆదేశించారు. విధులకు గైర్హాజరయ్యే కార్మికులు, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్