విశాఖలోని కంబాలకొండలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బందికి విత్తన బంతుల తయారీపై శిక్షణ ఇచ్చారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణం వేడెక్కుతోందని, దీని నివారణకు వర్షాల సమయంలో కొండలు, మైదానాలు, తీర ప్రాంతాల్లో విస్తృతంగా విత్తన బంతులు చల్లాలని విశాఖపట్నం చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐకేవీ రాజు పిలుపునిచ్చారు. ప్రజలు కూడా తాము తిన్న పండ్ల దేశీయ విత్తనాలను సేకరించి అటవీ శాఖకు అందించాలని సూచించారు. ఎన్జీఓ ప్రతినిధి జేవీ రత్నం విత్తన బంతుల తయారీ విధానాన్ని వివరించారు. ఈ శిక్షణలో పలువురు డీఎఫ్ఓలతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన 400 మందికి పైగా అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.