విశాఖ: గీతం భూముల క్రమబద్ధీకరణపై వైసీపీ గర్జన: భారీ నిరసన

0చూసినవారు
విశాఖ: గీతం భూముల క్రమబద్ధీకరణపై వైసీపీ గర్జన: భారీ నిరసన
విశాఖలోని గీతం విద్యాసంస్థల పరిధిలోని సుమారు 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజేషన్ చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వైసీపీ శ్రేణులు గురువారం గీతం కాలేజీ ఎదుట భారీ నిరసన చేపట్టాయి. విశాఖ జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు, ఎంఎల్‌సీలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రూ.5 వేల కోట్ల విలువైన భూమిని ఎంపీకి చెందిన విద్యాసంస్థకు కట్టబెట్టేందుకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండా పెట్టడం కుట్ర అని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్