మధురవాడలోని చంద్రంపాలెం గ్రామంలో బుధవారం శ్మశానం వద్ద గేదెల ఫణి (18) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.