యువ హీరో రోషన్ కనకాల, దర్శకుడు సందీప్ రాజ్ కాంబినేషన్‌లో వస్తున్న 'మోగ్లీ' చిత్రం ప్రచారం విశాఖపట్నంలో బుధవారం ప్రారంభమైంది. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా యూనిట్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ఒక 'యూనిక్ లవ్ స్టోరీ' అని, తమకు సెంటిమెంట్ అయిన విశాఖ నుండే ప్రచారం మొదలుపెట్టామని హీరో రోషన్ తెలిపారు. హర్ష కామెడీ, కాళ భైరవ సంగీతం హైలైట్‌గా నిలిచే ఈ సినిమాను విశాఖ పరిసరాల్లో షూటింగ్ చేశామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సాక్షి, కమెడియన్ హర్ష చెముడు పాల్గొన్నారు.