Apr 13, 2026, 14:04 IST/సనత్నగర్
సనత్నగర్
వ్యాపార సిలిండర్ల అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం
Apr 13, 2026, 14:04 IST
హోటళ్లు, పరిశ్రమలకు కమర్షియల్ ఎల్పీజీని కోటా ప్రకారం సరఫరా చేయాలని, బ్లాక్ మార్కెట్ చేస్తే లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు పెడతామని సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సోమవారం హైదరాబాద్లో హెచ్చరించారు. అదనపు వసూళ్లు, సరఫరాలో జాప్యంపై కఠిన చర్యలు ఉంటాయని, వినియోగదారులు అనధికారికంగా సిలిండర్లు కొనవద్దని ఆయన సూచించారు.