Mar 06, 2026, 01:03 IST/జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్
తమ్ముడిని హత్య చేసిన ముగ్గురికి 10 ఏళ్ల జైలు
Mar 06, 2026, 01:03 IST
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులకు రంగారెడ్డి జిల్లా కూకట్‌పల్లి కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్ మిశ్రా, ధర్మేంద్ర ప్రసాద్ మిశ్రా, బీరేంద్ర ప్రసాద్ మిశ్రా అనే అన్నదమ్ములు 18 నవంబర్ 2016న దేవేంద్ర ప్రసాద్ మిశ్రాపై కత్తి, గాజు పలకతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. నిందితులకు ఒక్కొక్కరికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు.