చోడవరం - Chodavaram

వీడియోలు


కొమరంభీం జిల్లా
టైగర్‌ రిజర్వ్‌లో స్మార్ట్‌ఫోన్ల నిషేధం!
May 18, 2026, 04:05 IST/

టైగర్‌ రిజర్వ్‌లో స్మార్ట్‌ఫోన్ల నిషేధం!

May 18, 2026, 04:05 IST
టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. పర్యాటకులు తమ స్మార్ట్‌ఫోన్లను చెక్‌పోస్ట్‌ల వద్ద డిపాజిట్ చేయాలి. ఫోటోగ్రఫీ కోసం సాధారణ డిజిటల్ కెమెరాలను అనుమతిస్తారు. స్మార్ట్‌ఫోన్ల వల్ల వన్యప్రాణుల ప్రశాంతత, భద్రత దెబ్బతింటుందని, సోషల్ మీడియాలో లైవ్ లొకేషన్ ట్యాగ్ చేయడం వేటగాళ్లకు సమాచారం అందించినట్లు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్యాటకులు రీల్స్, లైవ్ వీడియోల కోసం జంతువులు కదిలేలా గట్టిగా అరుస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. దీని వల్ల వన్యప్రాణులు ఒత్తిడికి గురవుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.