Mar 05, 2026, 14:03 IST/
కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్లేనా?
Mar 05, 2026, 14:03 IST
TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, ఉచిత కరెంట్, చౌక గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు రేషన్ కార్డును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో లక్షలాది మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డుల జారీని నిలిపివేయడంతో అర్హులైన వారు ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందున, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కార్డుల జారీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.