చోడవరం మద్యం మత్తులో కాలువలో పడి ఒక వ్యక్తి మృతి

70చూసినవారు
మద్యం మత్తులో కాలువలో పడి ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోడవరంలో జరిగింది. చోడవరం ఆంధ్ర బ్యాంకు దరి శ్రీరామ్మూర్తి కాంప్లెక్స్ వద్ద గల కాలువలో పడి ద్వారకా నగర్ కు చెందిన పుడమి ఏసు(40) మృతి చెందాడు. బుధవారం ఉదయం పంచాయతీ పారిశుధ్య కార్మికులు కాలువలు తీసే పనిలో ఉండగా ఈ మృతదేహం బయటపడింది. ఇతడు చోడవరం పట్టణంలో రోడ్లపై ప్లాస్టిక్ సామాగ్రి ఏరుతుంటాడని చెబుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్