చోడవరం లో ఎయిడ్స్ దినోత్సవ వేడుకలు

5చూసినవారు
చోడవరం లో ఎయిడ్స్ దినోత్సవ వేడుకలు
ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా సోమవారం చోడవరం సిహెచ్‌సి, ఐసిటిసి ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. స్థానిక శాసన సభ్యులు కేఎస్ఎన్ఎస్ రాజు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎయిడ్స్ పై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. స్థానిక కళాశాలల విద్యార్థులు, వైద్యులు, సిబ్బంది ఆసుపత్రి నుండి కొత్తూరు జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి, కొత్తూరు జంక్షన్ లో మానవహారం ద్వారా ప్రజలకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్