గవరవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ నెల 30 నుండి ఫిబ్రవరి 13 వరకు 'స్పర్శ' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కుష్ఠు వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. వ్యాధితో బాధపడుతున్న వారి పట్ల వివక్ష చూపకూడదని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాఠశాల హెచ్ఎం, పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.