చోడవరం వివేకానంద కాలేజీలో మంగళవారం మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ఆన్లైన్ మోసాలు, రోడ్ సేఫ్టీపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సిఐ అప్పలరాజు ఆదేశాల మేరకు ఎస్సైలు జోగారావు, కమల్ భార్గవ్ యువతను చెడు మార్గాల వైపు వెళ్ళవద్దని, భవిష్యత్తును నాశనం చేసుకోరాదని సూచించారు. ఆన్లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, సెల్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.