స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండుసార్లు వేతనాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కిందని తెలిపారు. ఎన్నికల ముందు అంగన్వాడీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాల కల్పనకు 86.68 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.