చోడవరం: నందన వనం లా పాత చెరువు అభివృద్ధి

5చూసినవారు
చోడవరం: నందన వనం లా పాత చెరువు అభివృద్ధి
చోడవరం పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న పాత చెరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి 50 లక్షల రూపాయలు మంజూరయ్యాయని ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్. రాజు తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కాంప్లెక్స్, విగ్నేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న ఈ చెరువును నందన వనంలా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు చెప్పారు. విడుదలైన 50 లక్షల రూపాయలతో పనులు ప్రారంభిస్తామని, అలాగే సీఎస్ఆర్ నిధులు, దాతల సహకారం కూడా తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత పోస్ట్