చోడవరం;పాఠశాలలకు క్రీడా పరికారాలు పంపిణీ

3చూసినవారు
చోడవరం;పాఠశాలలకు క్రీడా పరికారాలు పంపిణీ
చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల సముదాయంలో బుధవారం మండలంలోని 14 పాఠశాలలకు క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. వి. రామిరెడ్డి, సి. ఆర్. యమ్. టి కె. వి. యమ్. నాయుడు ఈ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శారీరక, మానసిక, సామాజిక, వ్యక్తిత్వ వికాసానికి ఆటలు చాలా ముఖ్యమని, అవి శరీరానికి వ్యాయామాన్ని అందించి కండరాలను బలోపేతం చేస్తూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, అలాగే మెదడు అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్