చోడవరం; రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి

5చూసినవారు
చోడవరం; రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి
మొంతా తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో వరి పంట పూర్తిగా నష్టపోయిందని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలుగా సహాయం అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ, వరి పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటు ధర లేక రైతులు ఏటా నష్టపోతున్నారని తెలిపారు. చోడవరం మండలంలో 32 పంచాయతీలలో 3500 హెక్టార్లకు పైగా సాగవుతున్న వరి పంట పొట్ట దశలో ఉండగా, భారీ వర్షాలతో వెన్నులు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్