తిరుపతి శ్రీవారి లడ్డుపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై మాజీ మంత్రి, చోడవరం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. శనివారం ఆయన చోడవరం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, లడ్డుపై అసత్య ప్రచారాలు చేస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కోటమ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ, లడ్డుపై వస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. తిరుమల దేవదేవునితో ఆటలాడితే సహించబోమని, ఆ దేవదేవుడు తప్పక కూటమి ప్రభుత్వం నాయకులను శిక్షిస్తాడని ఆయన అన్నారు.