మేలు రకం పశుగ్రాసంతో అధిక దిగుబడి వస్తుందని, వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ చిoదాడ సత్యం అన్నారు. బుధవారం చోడవరం మండలం జన్నవరం గ్రామంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు సూచన మేరకు గోవాడ పశు వైద్య అధికారి పర్యవేక్షణలో, పశుగ్రాస వారోత్సవాల సందర్భంగా పాడి రైతులకు గ్రామ సర్పంచ్ కోసం సన్యాసిరావు అధ్యక్షతన అవగాహన కల్పించారు. ఈనెల 7 నుండి 14 వరకు పశుగ్రాస వారోత్సవాలు జరుగుతాయన్నారు.