చోడవరం; ఘనంగా కేశవ స్వామి తిరువీధి ఉత్సవము

2చూసినవారు
చోడవరం; ఘనంగా కేశవ స్వామి తిరువీధి ఉత్సవము
చోడవరంలో పురాతనమైన శ్రీ కేశవ స్వామి వారి కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం గ్రామంలో పెద్ద ఎత్తున కోలాటాలతో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు, ఈవో సత్యనారాయణమూర్తి, టిడిపి నాయకులు మల్లు నాయుడు, కమిటీ సభ్యులు ఉపాధ్యాయుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :