గోవాడ ఫ్యాక్టరీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకొని, ఈ ఏడాది క్రషింగ్ కూడా జరుపుకోలేని పరిస్థితుల్లో రైతుల ఆశలను అడియాసలు చేసిందని, వెంటనే క్రషింగ్ ప్రారంభించి బకాయిలు చెల్లించాలని అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. శుక్రవారం చోడవరంలో ఫ్యాక్టరీ సమస్యపై అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్, మాజీ విప్ కే ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి పోరాటమే శరణ్యమని పిలుపునిచ్చారు.