చోడవరంలో అతి పురాతన శ్రీదేవి భూదేవి సమేత శ్రీశ్రీశ్రీ కేశవ స్వామివారి 753వ వార్షిక కళ్యాణ ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకుడు సీతారామాచార్యులు ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి.