చోడవరం: మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుండాలి

5చూసినవారు
చోడవరం: మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుండాలి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థినులకు 'ఆత్మరక్షణ మెలుకువలు'పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం చోడవరం బాలికల ఉన్నత పాఠశాలలో చోడవరం సీఐ అప్పలరాజు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, మార్షల్ ఆర్ట్స్ నిపుణులు విద్యార్థినులకు ప్రత్యక్ష ప్రదర్శనలు ఇచ్చి, అత్యవసర పరిస్థితుల్లో తమను తాము ఎలా రక్షించుకోవాలో వివరించారు. ఎస్సై నాగకార్తీక్ మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ఉండాలని, ఆకతాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.