సద్భావ టీం ఆధ్వర్యంలో వెయ్యి గుడ్డ సంచుల పంపిణీ

2చూసినవారు
చోడవరం కేంద్రంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీడివిఎం సద్భావ టీం, ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గురువారం క్యాలెండర్ తో కూడిన వెయ్యి గుడ్డ సంచులను పంపిణీ చేసింది. స్వయంభు విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద గల సద్భావ ఫ్రిడ్జ్ వద్ద ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజేష్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ గురించి వివరిస్తూ సభ్యులు ఈ సంచులను పంపిణీ చేశారు. ఎంపీపీ గాడి కాసులమ్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీం ప్రతినిధులు పి సాంబ, గీతా లక్ష్మి, కుమారి, రజిని, పి శ్రీనివాస్, వి శ్రీనివాస్, విజయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్