అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం చోడవరం భవిత కేంద్రంలో ఏపీ సమగ్ర శిక్ష, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఎం. పాండురంగారావు, కె. సింహాచలం, జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ. వి. రామిరెడ్డి, చోడవరం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. లక్ష్మి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున దివ్యాంగ బాల బాలికలు, వారి తల్లిదండ్రులు హాజరైన ఈ సందర్భంగా, దివ్యాంగ బాలబాలికలకు ఆట పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.