చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సిద్ధి బుద్ధి సమేత శ్రీ గణపతి స్వామి వారి ఆలయ నిర్మాణానికి, హోమాధి కార్యక్రమాలకు విశ్వహిందూ పరిషత్ సభ్యుడు రమణ స్వామి రూ. 2.30 లక్షల విరాళం అందజేశారు. ఈ మొత్తంలో రూ. లక్ష ఆలయ నిర్మాణానికి, రూ. 1.30 లక్షలు ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా హోమాధి కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు శుక్రవారం తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు దాతను అభినందించారు.