శ్రీనివాసరావు కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

4చూసినవారు
శ్రీనివాసరావు కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ
మామిడి కొమ్మల కోసం చెట్టు ఎక్కి కాలుజారి పడిపోయి ఆరు నెలలుగా కదలలేని స్థితిలో ఉన్న బొత్స శ్రీనివాసరావు కుటుంబాన్ని శుక్రవారం సిడివిఏం కమ్యూనిటీ సద్భావ టీం సభ్యులు పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యాడని తెలుసుకున్న సద్భావ టీం సభ్యులు గీత లక్ష్మి, కుమారి, పిఎస్ఎన్ మూర్తి తదితరులు శుక్రవారం చోడవరంలో గల వారి ఇంటికి వెళ్లి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నెల రోజుల క్రితం చెట్టు మీద నుంచి పడిపోయిన తర్వాత మెడ వద్ద నరాలు చిట్లిపోయాయని, కేజీహెచ్ లో చికిత్స పంపడం జరిగిందని అతడి భార్య లక్ష్మి తెలిపింది.

సంబంధిత పోస్ట్