అనకాపల్లి జిల్లా చోడవరం తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు నిందితులకు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. న్యాయమూర్తి ఎం. హరినారాయణ బుధవారం ఈ తీర్పు వెలువరించారు. 2017 జనవరి 8న కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో పెంట శ్రీనివాసరావు, వలబుల నూకరాజు, సుర్ల రమణ, కర్రి రామారావు అనే నిందితులపై మోపబడిన నేరం రుజువు కావడంతో ఈ శిక్ష విధించారు. అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా ఈ వివరాలను అందించారు.