కిసాన్ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ గా గొంతిన

6చూసినవారు
కిసాన్ మోర్చా సోషల్ మీడియా కన్వీనర్ గా గొంతిన
అనకాపల్లి జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా నూతన జిల్లా కమిటీ బుధవారం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం, బుచ్చయ్యపేట మండలం, వడ్డాదికి చెందిన గొంతున ఈశ్వరరావును జిల్లా కిసాన్ మోర్చా సోషల్ మీడియా జిల్లా కన్వీనర్గా నియమించారు. కమిటీలో ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు ఉపాధ్యక్షులు, ఐదుగురు సెక్రటరీలు, కమిటీ సభ్యులను నియమించి, అందరికీ పార్టీ బాధ్యతలతో కూడిన పత్రాలు అందజేసి ప్రమాణం చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్