ఫిబ్రవరి నెలాఖరు లోగా లైఫ్ సర్టిఫికెట్లు దాఖలు చేయాలి

2చూసినవారు
ఫిబ్రవరి నెలాఖరు లోగా లైఫ్ సర్టిఫికెట్లు దాఖలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, పింఛన్దారులందరూ తమ జీవన ప్రమాణ పత్రాలను (లైఫ్ సర్టిఫికేట్లను) ఈనెల 1వ తేదీ నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా దాఖలు చేయాలని చోడవరం ఉపకజానా కార్యాలయం పరిధిలోని పింఛన్దారుల సంఘం అధ్యక్షులు వి.చినబాబు, దక్షిణామూర్తిలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. చోడవరం ట్రెజరీ పరిధిలోని పింఛన్దారుల కోసం ఎస్.టి.ఓ.ఎల్. మీనా ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్లు తీసుకోవడం ప్రారంభమైందని, పింఛన్దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్