చోడవరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఉన్న దివ్యాంగ విద్యార్థుల భవిత కేంద్రాన్ని రాష్ట్ర సమగ్ర శిక్ష సహిత విద్య ప్రాజెక్టు దృష్టి రాష్ట్ర పరిశీలకులు బొడ్డు మహాలక్ష్మి నాయుడు బుధవారం పర్యవేక్షించారు. దివ్యాంగ విద్యార్థుల వివరాలన్నింటినీ దృష్టి సాఫ్ట్వేర్ లో అప్డేట్ చేయాలని ఆయన సూచించారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా దివ్యాంగ విద్యార్థులకు అన్ని రకాల సేవలు, సదుపాయాలు కల్పించవచ్చని, విద్యా బోధనను డిజిటల్ లో సులభంగా అందించవచ్చని తెలిపారు.