చోడవరం పంచాయతీ పరిధిలోని కోటవీధి, గండికోలనీ, శివాలయం వీధి ప్రాంతాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు చేతులమీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండిఓ ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, గూనూరు మల్లునాయుడు, గూనూరు పెదబాబు, టిడిపి పట్టణ అధ్యక్షులు యర్రంశెట్టి చిన్న తదితరులు పాల్గొన్నారు.