చోడవరంలో జాబ్ మేళా ను ప్రారంభించిన ఎమ్మెల్యే

13చూసినవారు
చోడవరంలో జాబ్ మేళా ను ప్రారంభించిన ఎమ్మెల్యే
ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన జాబ్ మేళాను స్థానిక ఎమ్మెల్యే కే ఎస్ఎన్ఎస్ రాజు ప్రారంభించారు. ఈ మేళాలో సుమారు 20 కంపెనీలు పాల్గొన్నాయి, 1800 ఖాళీలు ఉన్నాయని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి జిల్లా అధికారి ఎన్ గోవింద రావు, కాలేజీ ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్