చోడవరం;ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే రాజు అధికారులు పర్యటన

1454చూసినవారు
చోడవరం;ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే రాజు అధికారులు పర్యటన
తుఫాను కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చోడవరం పంచాయతీలోని ద్వారకా నగర్, బాలాజీ నగర్, అన్నవరం, ఐటిఐ కాలనీ, బానయ్య కోనేరు, రెల్లి వీధి వంటి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను చోడవరం గవర్నమెంట్ హై స్కూల్, నూకాంబిక కళ్యాణ మండపాలలో పునరావాస కేంద్రాలకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్