గోవాడ సుగర్స్ కార్మికులు, రైతులు చేపట్టిన దీక్షల నేపథ్యంలో, చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ విషయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దండుపాటి తాతారావు కోరారు. బుధవారం ఆయన ఎమ్మెల్యేలకు బహిరంగ లేఖ రాశారు. రైతులకు సబ్సిడీతో కూడిన దవ్వ లేదా పిలకలు సరఫరా చేయాలని, ఫ్యాక్టరీని 4 లక్షల టన్నుల నుండి 5 లక్షల టన్నుల లేదా అంతకంటే ఎక్కువ కెపాసిటీతో ఆధునీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.