చోడవరం షుగర్ ఫ్యాక్టరీ వద్ద అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘాలు, కార్మిక సంఘం, ప్రజా సంఘాలు కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ చేయాలని, రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించాలని, చెరుకును పాలకొండ ఫ్యాక్టరీకి తరలించవద్దని డిమాండ్ చేస్తూ శనివారం మోకాళ్ళపై నిరసన తెలిపారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు రోడ్డున పడ్డారని, గత ఏడాది బకాయిలు కూడా చెల్లించడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు.