రోలుగుంట హైస్కూల్లో ఎస్.ఏ.గా పనిచేస్తున్న పి.వి.ఎం. నాగజ్యోతి, విద్యా రంగంలో 27 ఏళ్లకు పైగా అంకితభావంతో సేవలందిస్తున్నందుకు గాను సావిత్రిబాయి ఫూలే ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో “ఉపాధ్యాయ రత్న – 2026” అవార్డును అందుకున్నారు. ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్లో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, ఉపాధ్యాయులు, ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డు ప్రదానం జరిగింది. నాగజ్యోతి విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందించడంలో విశేష కృషి చేస్తున్నారు.